Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Bichagadu: The billionaire


''బిచ్చ‌గాడు'' సక్సెస్ మీట్!
విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'పిచ్చైకార‌న్‌'. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి బిచ్చ‌గాడు. టైటిల్ తో తెలుగులో అనువదించారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు బిచ్చగాడు అనే టైటిల్ పెట్టినప్పుడు నెగెటివ్ ఇంపాక్ట్ వస్తుందని అందరూ అన్నారు. కాని ఈ సినిమాకు టైటిల్ పెద్ద ప్లస్ అయింది. తమిళంలో ఈ సినిమాను ఎంతగా ఆదరించారో.. దానికి మించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెరుగుతుంది. స్క్రిప్ట్ ను నమ్మి తెలుగులో రిలీజ్ చేసిన చదలవాడ శ్రీనివాస్ గారికి థాంక్స్. నేను తదుపరి చేయబోయే సినిమాల చిత్రీకరణ యాబై శాతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే చేయాలని భావిస్తున్నాను'' అని చెప్పారు. శశి మాట్లాడుతూ.. ''హ్యూమన్ ఎమోషన్స్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమా చేశాను. తమిళం, తెలుగుకు ఈ సినిమా సూట్ అవుతుందా.. అని ఆలోచించలేదు. కథను నమ్మి తీశాను. తెలుగులో పెద్ద మాసివ్ హిట్ గా నిలిచింది'' అని చెప్పారు. చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ముప్పై సంవత్సరాల తరువాత ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించామని ఆనందంగా ఉంది. తమిళం కంటే ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రేపటినుండి థియేటర్స్ సంఖ్యను పెంచబోతున్నాం'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, సాత్న, భాష శ్రీ తదితరులు పాల్గొన్నారు.