సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భూమిక


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు  సినిమాలతో  మెరిసిన హీరోయిన్ భూమిక. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దానితో పాటు కొన్ని విలక్షణమైన పాత్రలు కూడా చేస్తూ తనదైన శైలిలో నటనను కనబరిచింది. రవి బాబు దర్శకత్వంలో వచ్చిన అనసూయ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తమిళ్, తెలుగు,హిందీ సినిమాలతో పాటు కన్నడ,మలయాళం,భోజ్ పూరి,పంజాబీ చిత్రాల్లో కూడా నటించి తన టాలెంట్ ను నిరూపించుకుంది.


అయితే ఇప్పుడు భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. గత ఏడాది ధోని సినిమాలో హీరోకి అక్కగా నటించిన భూమిక, ఇప్పుడు నాచురల్ స్టార్ నాని " నిన్ను కోరి" చిత్రంలో సైతం నానికి అక్క పాత్ర చేయబోతోందని సమాచారం.