ఇప్పుడు హీరోయిన్స్ అందరికీ ఆమే ఆద‌ర్శం


 రీల్ లైఫ్ కోసం కష్టపడే హీరోయిన్స్ కి రియల్ లైఫ్ లో బయటకి చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి అన్నది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ . అయితే నటి భావనపై జరిగిన ఉదంతంతో.. సినిమా స్టార్లు కూడా తమ పై గతంలో జరిగిన  వేధింపులకు ఒక్కొకరుగా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు .  


తనపై జరిగిన దాడికి బెదరకుండా పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టింది భావన మాకు అందరికి స్ఫూర్తి  దాయకం అంటున్నారు .  అందుకే హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరుగా వారి జీవితాల్లో ఎదుర్కొన్న విపత్కర సంఘటనల గురించి ఇప్పుడిప్పుడే వెల్లడిస్తున్నారు. ప్రముఖ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కూడా తనపై జరిగిన వేధింపులను వివరించింది. మీడియాకు సంబంధించిన ఓ వ్యక్తి తనతో ప్రవర్తించిన విధానాన్ని బయటపెట్టేసింది ఈ భామ. టాలీవుడ్ నటి రెజీనా సైతం తనపై జరిగిన వేధింపులను బయటపెట్టింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో ఓ  వ్యక్తి తనకు ఫోన్ చేసి తమిళంలో తీయబోతున్న సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే అందుకోసం తనను కొంత ‘అడ్జెస్ట్ మెంట్స్’ చేసుకోవాలని అన్నాడట. ‘మీరున్న రంగం ఏదైనప్పటికీ, చుట్టు పక్కల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ఎవరైనా సరే.. చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ నేటి యువతులకు సలహా కూడా ఇచ్చింది రెజినా. ఏదేమైనా మృగాళ్లు చేసిన ఆటవిక చర్యకి భయపడకుండా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి భావన మిగతా అందరికి ఆదర్శంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు.