Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Bhallaladeva Missed The Golden Chance


After Bahubali double the craze of Prabhas got to Rana. Rana became busy with many movies now a days with the effect of Bahubali. Because of this he lost a super hit movie with his own hands and that movie is Bichagadu. Tamil movie named Pichaikaran dubbed into Telugu as Bichagadu. The producer of this super hit movie in Tamil is Vijay Antony himself. He thought to remake this movie in telugu with Rana and said story to him but Rana didn't connect to the story.
So Vijay Antony dubbed this movie in telugu as Bichagadu. This movie released without any expectations and got huge success in telugu too. Got applause from all critics.
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న భ‌ల్లాల‌దేవ‌
బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ కి వ‌చ్చిన క్రేజ్ కి డ‌బుల్ క్రేజ్ వ‌చ్చిన‌వారు ఎవ‌రైనా ఉన్నారా అంటే రానా ముందు వ‌రుస‌లో ఉంటాడు. బాహుబ‌లి సినిమా ఎఫెక్ట్ తో రానా ఈ మ‌ధ్యకాలంలో వ‌రుస సినిమాల‌తో బిజీబిజీ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల సూప‌ర్ హిట్ అయిన ఒక సినిమాను రానా వ‌దులుకున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాయే బిచ్చగాడు. త‌మిళంలో పిచ్చైకార‌న్ పేరుతో రూపొందిన సినిమా తెలుగులో బిచ్చ‌గాడు పేరుతో తెర‌కెక్కింది. త‌మిళంలో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన ఈ సినిమాకు నిర్మాత కూడా విజ‌య్ ఆంటోని, ఈ సినిమా తెలుగులో రానా తో రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని భావించి, ఆ నేప‌థ్యంలోనే రానాను క‌లిసి క‌థ కూడా వినిపించాడు. కానీ ఎందుకో రానా ఈ క‌థ‌కు క‌నెక్ట్ కాలేక‌పోయాడ‌ట‌.
ఈనేప‌థ్యంలోనే విజ‌య్ ఆంటోని తెలుగులోకి బిచ్చ‌గాడు అనే సినిమాను అనువ‌దించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా, తెలుగులో కూడా అనూహ్యమైన విజ‌యాన్ని సొంతం చేసుకుని, వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రంగా అంద‌రి మ‌న్న‌న‌ల‌ను అందుకుంది.