పూరీ కౌంట్‌డౌన్ మొద‌లైనట్లే..!


నందమూరి న‌టసింహం బాల‌కృష్ణ‌, డాషింగ్ డైర‌క్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను రేపు హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా లండ‌న్, స్పెయిన్ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. అస‌లు 60 రోజుల్లోనే సినిమా తీస్తాన‌న్న పూరీ, మొన్నేమో కాస్టింగ్ కాల్ అన్నాడు. ఇప్పుడు విదేశాల్లో షెడ్యూల్స్ అంటున్నాడు. మ‌రి 60 రోజుల్లో ఇన్ని ఎలా మ్యానేజ్ చేస్తాడో అనే టాక్ ఉన్న‌ప్ప‌టికీ, పూరీ కెపాసిటీ తెలిసిన వాళ్లు మాత్రం ఏం మాట్లాడ‌ట్లేదు. అస‌లు ఈ క్రేజీ కాంబినేష‌న్ లో సినిమా అన‌గానే చాలా మంది  ఆశ్చ‌ర్య‌పోయారు.


పూరీ టేకింగ్ స్టైల్, బాల‌య్య యాక్టింగ్ స్టైల్ రెండూ రెండు దారులు. అలాంటిది వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా అంటే  బాల‌య్య పూరీ దారిలోకి వ‌స్తాడా లేక పూరీ బాల‌య్య దారిలోకి వ‌స్తాడా అన్న‌ది మాత్రం అర్థం కావ‌ట్లేదు. అయితే ఈ సినిమా కోసం పూరీ బాలయ్య కోసం చాలా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ ను డిజైన్ చేశాడ‌ట‌. మ‌రి వీరి కాంబినేష‌న్ లో బాల‌య్య‌ను పూరీ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.