బాల‌య్య మ‌ల్టీస్టారర్.. ఆ హీరోతోనే..


గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి విజ‌యం సాధించిన సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించిన బాల‌య్య‌కు ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. మీరు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తారా, న‌టిస్తే ఎవరితో క‌లిసి చేస్తారు అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా, మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయడానికి త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని, తానెప్పుడైనా సిద్ధ‌మే కానీ, ఎవ‌రితో చేస్తానో చెప్ప‌ను కానీ, ఖ‌చ్చితంగా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో , అది కూడా పౌరాణికంలోనే చేస్తాన‌ని బాల‌య్య సెల‌విచ్చారు. ఆల్రెడీ సీనియ‌ర్ హీరోలైన వెంక‌టేష్, నాగార్జున ఇప్ప‌టికే మ‌ల్టీస్టార‌ర్స్ చేసి ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరు చాలా గ్యాప్ తర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టారు. సో, చిరు మ‌ల్టీస్టార‌ర్ తెలిసి తెలిసి ఇప్ప‌ట్లో చేయడు. బాల‌య్య అనుకుంటున్న ఆ హీరో ఎవ‌రో మ‌రి ఆయ‌న‌కే తెలియాలి. బాల‌య్య లాంటి స్టార్ హీరో మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తే ఆ సినిమా కు అంచ‌నాలు మామూలు రేంజ్ లో ఉండ‌వు. చూద్దాం బాల‌కృష్ణ వెండితెర‌ను ఏ హీరోతో పంచుకోనున్నాడో..