బాహుబ‌లిః ది కంక్లూజ‌న్ ర‌న్ టైమ్ 2 గంట‌ల 50 నిమిషాలు


బాహుబ‌లిః ది కంక్లూజ‌న్.. యావ‌త్ భార‌త‌దేశం ఎదురు చూస్తున్న సినిమా. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం దేశ సినిమా చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డుల‌ను తిరిగ‌రాయ‌నుంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ అందుకోలేక‌పోయిన 1000 కోట్ల మార్క్ ను సాధించి, చరిత్ర‌లో నిలిచిపోతుంద‌ని ఆల్రెడీ అంచ‌నాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి అంద‌రిలో ఓ ప్ర‌శ్న మొద‌లైంది. అస‌లు బాహుబ‌లి-2 ర‌న్ టైమ్ ఎంత ఉండ‌నుంద‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది.

అయితే ఇప్ప‌టికే రాజ‌మౌళి త‌మ ద‌గ్గ‌ర నాలుగు గంట‌ల సినిమా ఉండ‌టంతోనే సినిమ‌ను రెండు భాగాలు చేయాల్సి వ‌చ్చింద‌ని గ‌తంలోనే సెల‌విచ్చాడు. అంటే దీన్ని బ‌ట్టి చూస్తే, బాహుబ‌లి ది బిగినింగ్ లో రెండున్న‌ర గంట‌లు చూశారు కాబట్టి, మిగ‌తా గంట‌న్న‌ర సినిమా ఉంటుంది. యాక్ష‌న్ సీన్స్, ఫైట్స్, సాంగ్స్ వీటన్నింటిని క‌లుపుకుని ఒక రెండు గంట‌ల వ‌ర‌కు పొడిగించి ఉంటారు అనుకున్నారంతా. కానీ సినిమా ర‌న్ టైమ్ దాదాపు 2 గంట‌ల 50 నిమిషాలలు ఉంటుంద‌ని రాజ‌మౌళి చెప్ప‌డంతో, ఇప్పుడు ఆ సినిమా ఎడిటింగ్ లో., అంత మేర‌కు ర‌న్ టైమ్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాయ‌ట యూనిట్ వ‌ర్గాలు. అంతేలే రెండున్న‌ర సంవ‌త్స‌రాలు వెయిట్ చేయించ‌నప్పుడు ఆ మాత్రం లెంగ్త్ ఉండాలిలే.