Bahubali2 Creates Records


Movie is nothing but business. But there is no fixed rate as we buy stores outside.If a movie is hit then the next movie coming from that hero or director will have huge demand. Now Bahubali 2 coming from Rajamouli also has same situation with huge demand.The 1st part of this film released world wide in different countries with different languages and collected more than 600 crores. With this craze for Bahubali 2 is very high so Producers are saying 35 crores only for Europe territory Rights. 1st part of this film is selled for 10crores for Us,Australia,Gulf and European territories. Now after increasing craze Producers are saying 35 crores only for Europe.
వామ్మో.. బాహుబ‌లి2 రేట్లు ఏంటీ..?
సినిమా అంటేనే వ్యాపారం. బ‌య‌ట ఒక వ‌స్తువు కు ఒక రేటు ఉన్న‌ట్టుగా సినిమాకు ఇక్క‌డ స్థిర‌మైన రేటు అంటూ ఉండ‌దు. ఏదైనా ఒక సినిమా హిట్ అయితే త‌ర్వాత ఆ హీరో, డైరక్ట‌ర్స్ చేసే సినిమాల‌కు మంచి  డిమాండ్ వ‌స్తుంది. ఇప్పుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి-2 కూడా ఇలాగే  భారీ రేటు ప‌లుకుతుంది. ఈ సినిమా మొద‌టిపార్ట్ వ‌రల్డ్ వైడ్ గా వివిధ భాష‌ల్లోకి, వివిధ దేశాల్లో రిలీజ్ అయి సుమారు 600 కోట్ల‌కు పైగానే సాధించింది. దీంతో బాహుబ‌లి సీక్వెల్ కు మ‌రింత క్రేజ్ పెరిగిన త‌రుణంలో ఈ చిత్ర నిర్మాత‌లు ఒక్క యూర‌ప్ టెర్రిటరీ రైట్స్ నే 35 కోట్లు చెబుతున్నార‌ట‌.  బాహుబ‌లి మొద‌టి భాగాన్ని యూఎస్, ఆస్ట్రేలియా, గ‌ల్ఫ్, యూర‌ప్ టెర్రిట‌రీలు అన్నిటికీ క‌లిపి ప‌దికోట్ల‌కు ఇచ్చార‌ట‌. ఇప్పుడు క్రేజ్ పెరిగిపోవ‌డంతో కేవ‌లం ఒక్క యూర‌ప్ కే ఇంత భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేస్తున్నారట నిర్మాత‌లు.