Babu bangaram Teaser On June 6th


బాబు టీజ‌ర్ రిలీజ్ చేస్తాడ‌ట‌..!
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బాబు బంగారం”. నయనతార కథానాయకిగా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంక‌టేష్ పోలీస్ గా న‌టించ‌నున్నాడు. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పంద‌న ల‌భించింది.
ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ను జూన్ 6న విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తుంది. ఈ టీజ‌ర్ ను బాబు బంగారం స్టోరీ థీమ్ ను ఎలివేట్ చేసేలా డిజైన్ చేశార‌ని టాక్. దృశ్యం త‌రువాత వెంక‌టేశ్ న‌టిస్తున్న చిత్రం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.