ఆ హీరోయిన్ నడుము ఇప్పుడు అందరికి బోర్ కొట్టేసింది


  తెలుగు నాట ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ రాగానే బీ టౌన్ వైపు ఆశగా చూడటం హీరోయిన్స్ కి అలవాటే.  అప్పట్లో  టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఇలియానా బి టౌన్ ఎంట్రీ అందరికీ షాక్ ఇచ్చింది.  'బర్ఫీ'తో మంచి హిట్ అందుకున్నా.. తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో.. మళ్లీ తెలుగు సినిమాల కోసం ఎదురు చూస్తోంది ఈ గోవా బ్యూటీ.ఆ  అవకాశాల కోసం నానా పాట్లు పడింది. బికినీల్లో ఫోజులు ఇచ్చి,  న్యూడ్ గా స్టిల్స్ దిగి, ఈ ,మధ్య కాలంలో చాలానే రచ్చ చేసింది ఇలియానా. 


ఇన్ని చేసిన అవకాశాలు రాకపోవడంతో ఇల్లీ బేబీ ఇప్పుడు కొత్త పాట  పాడటం  నాకు అసలు కమర్షియల్ సినిమాలు అంటేనే ఇష్టం ఉండదు.. అలాంటి రోల్స్ చేయడం నాకు కష్టం. అందుకే సినిమాలు సైన్ చేయడం లేదు అంటూ బాంబ్ పేల్చింది. నిజానికి కమర్షియల్ సినిమాల్లో అయినా ఇలియానా వెనుక పరిగెత్తేసి అంతేసి ఛాన్సులు  ఇవ్వడానికి ఎవరు ముందుకి రావడం లేదు.  అలాంటప్పుడు ఇలియానా ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తుంది అంటూ ఆమె పై సోషల్ మీడియాలో జోక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఒకప్పుడు నడుము అందాలకు కేరాఫ్‌గా ఉండే ఇలియానా ప్రస్తుతం కరువు కంట్రీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోవడానికి  నిజంగా ఆమె తీసుకున్న చెత్త నిర్ణయాలే కారణం అని చెప్పుకోవచ్చు.