బ‌న్నీపై ప‌వ‌న్ ప్ర‌భావం..


కొన్ని సినిమాలు వ‌చ్చి ఎన్నాళ్ల‌యినా, ఆ ఇంపాక్ట్ మాత్రం అంతే ఉంటుంది. అలాంటి సినిమాల్లో గ‌బ్బ‌ర్ సింగ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా అందులోని అంత్యాక్ష‌రి ఎపిసోడ్. అప్ప‌టివ‌ర‌కు సీరియ‌స్ గా ఉన్న సినిమా కాస్త, థియేట‌ర్లో ప్ర‌తీ ప్రేక్ష‌కుడితో విజిల్స్ కొట్టేలా చేసింది. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు అలాంటి కామెడీ కోసం ట్రై చేసినా, అది కావాల‌ని చేసిన‌ట్లు, ఆ సీన్ ను కాపీ కొట్టి చేసిన‌ట్లే ఉంది త‌ప్ప‌, గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ఆ సీన్ కు వ‌చ్చినంత హైప్ అయితే రాలేదు.

ఈ నేప‌థ్యంలోనే, ఇప్పుడు మ‌రోసారి ఆ అంత్యాక్ష‌రి ఎపిసోడ్ ను పోలి ఉండే సీన్ ను ట్రై చేస్తున్నార‌ట‌. అయితే ఇది మ‌రెవ‌రో కాదు. గబ్బ‌ర్ సింగ్ డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌రే. వాస్త‌వానికి ఆ ఐడియా ప‌వ‌న్ దే అయిన‌ప్ప‌టికీ, దాన్ని డెవ‌ల‌ప్ చేసింది మాత్రం హ‌రీషే. ప్ర‌స్తుతం అల్లుఅర్జున్ తో దువ్వాడ జ‌గన్నాధం ను తెర‌కెక్కిస్తున్న హ‌రీష్ శంక‌ర్, ఈ సినిమా కోసం అంత్యాక్ష‌రి ఎపిసోడ్ కు సీక్వెల్ గా డీజీలో ఓ ఎపిసోడ్ ను ఆల్రెడీ హ‌రీష్ తీర్చిదిద్దాడ‌ని, మొత్తం సినిమాలో ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలవ‌డం ఖాయం అంటున్నారు. వేసవిలో విడుద‌ల కానున్న ఈ సినిమా, మ‌రి గ‌బ్బ‌ర్ సింగ్ ఇంపాక్ట్ ను ఇస్తుందో లేదో చూడాలి.