Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

మాంత్రికుడి పేరుతో ఆండ్రాయిడ్ యాప్


ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులందరికీ ఇదో వేడుక సమయం! ఎ.బి.సి. డిజిటల్ మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ ను, వెబ్ సైట్ ను  (www.trivikramcelluloid.in) ఈ సంస్థ ప్రారంభిస్తోంది. కోట్లాది తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు (నవంబర్ 7) న ఈ కానుకను అందించబోతోంది. ఇక మీదట ఆయన అభిమానులంతా ఒకే ఒక్క క్లిక్ తో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల తాజా విశేషాలను తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను నవంబర్ 7 నుంచి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యూజర్ ఫ్లెండ్లీ యాప్ ఇందులోని అప్ డేట్స్ అన్నింటినీ నోటిఫికేషన్ మెసేజ్ ద్వారా యూజర్స్ కు తెలియచేస్తుంది అని సంస్థ ప్రతినిధి రాహుల్ మీడియా కు తెలిపారు