మెగా సినిమాల‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ‌


హాట్ యాంక‌ర్ అన‌సూయ, అటు బుల్లితెర‌పై, ఇటు వెండితెర‌పై త‌న అందాల‌తో యూత్ కు పిచ్చెక్కిస్తుంది. ఓ వైపు ఎంట‌ర్‌టైన్ మెంట్ షో ల‌కు యాంక‌రంగ్ , మ‌రోవైపు ఆడియో లాంఛ్ లు, అప్పుడప్పుడు ఫొటోషూట్ లతో నా అందాలు చూసి అయినా నాకు ఛాన్స్‌లివ్వండంటూ గుర్తు చేస్తూ ఉంటుంది అమ్మ‌డు. అయితే కేవ‌లం యాంక‌రింగ్ మీద మాత్ర‌మే అమ్మ‌డి దృష్టి లేదు. సినిమా ఛాన్స్ ల కోసం కూడా తెగ ప్ర‌య‌త్నించేస్తుంది. ఈ నేప‌థ్యంలోనే అన‌సూయకు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో క‌నిపించే ఛాన్స్ వ‌చ్చింద‌నే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

రీసెంట్ గా సాయి ధ‌రమ్ తేజ్ విన్న‌ర్ లో ఓ స్పెష‌ల్ సాంగ్ చేసిన అన‌సూయకు మ‌రో మెగా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, సుకుమార్ కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమాలో కూడా అన‌సూయ చిందులేయ‌నుంద‌ట‌. అస‌లే త‌న‌పై మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారంటూ అనసూయ కామెంట్ చేసినా, మ‌ళ్లీ హాట్ బ్యూటీకి మెగా ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న చేసే అవ‌కాశం రావ‌డం అంటే మాట‌లు కాదు. రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా స‌మంత న‌టిస్తున్న ఈ సినిమాలో అన‌సూయ‌కు ఆల్రెడీ ఒక రోల్ క‌న్ఫార్మ్ అయిన‌ట్లే అంటున్నారు. ఏప్రిల్ 10నుంచి ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో అన‌సూయ కూడా పాల్గొన‌నుంద‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా, దేవీశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు.