విన్న‌ర్ తో జ‌బ‌ర్ద‌స్త్ పాప‌


సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం విన్నర్. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, బేబి భ‌వ్య సమర్పణలో... న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. `విన్న‌ర్` అనే టైటిల్ చ‌క్క‌గా స‌రిపోతుంద‌ని పెట్టాం.  నవంబర్  2 నుంచి ఉక్రెయిన్ లో మూడు పాటలు చిత్రీకరించబోతున్నాం. సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ మీద చిత్రీకరించబోయే ఈ పాటలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్ లో యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తాం. దీంతో పాటు అనసూయ మీద ఓ స్పెషల్ సాంగ్, కొన్ని సీన్స్ కూడా ప్లాన్ చేశాం. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిస్తున్నారు. ఐదు పాట‌లు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన ర‌చ‌న ఆక‌ట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి క‌థ‌నిచ్చారు `` అని అన్నారు.
సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో  జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  కెమెరా:  చోటా.కె.నాయుడు, సంగీతం:  త‌మ‌న్‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్‌పూడి, ఆర్ట్:   ప్ర‌కాష్‌, ఫైట్స్:  ర‌వివ‌ర్మ‌, క‌థ‌:  వెలిగొండ శ్రీనివాస్‌, ర‌చ‌న‌: అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని.