రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ సినిమాలో అన‌సూయ చేసేది ఐటెమ్ సాంగ్ కాద‌ట‌..


హాట్ యాంక‌ర్ అన‌సూయ, అటు బుల్లితెర‌పై, ఇటు వెండితెర‌పై త‌న అందాల‌తో యూత్ కు పిచ్చెక్కిస్తుంది. ఓ వైపు ఎంట‌ర్‌టైన్ మెంట్ షో ల‌కు యాంక‌రంగ్ , మ‌రోవైపు ఆడియో లాంఛ్ లు, అప్పుడప్పుడు ఫొటోషూట్ లతో నా అందాలు చూసి అయినా నాకు ఛాన్స్‌లివ్వండంటూ గుర్తు చేస్తూ ఉంటుంది అమ్మ‌డు. అయితే కేవ‌లం యాంక‌రింగ్ మీద మాత్ర‌మే అమ్మ‌డి దృష్టి లేదు. సినిమా ఛాన్స్ ల కోసం కూడా తెగ ప్ర‌య‌త్నించేస్తుంది. ఈ నేప‌థ్యంలోనే అన‌సూయకు ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో క‌నిపించే ఛాన్స్ వ‌చ్చింద‌నే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

త‌న‌కు న‌చ్చిన పాత్ర‌ల‌ను మాత్ర‌మే చేసుకుంటూ వెళ్తున్న అన‌సూయ‌కు, సుకుమార్- రామ్ చ‌ర‌ణ్ సినిమాలో న‌టించ‌నుంద‌నే వార్తలొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ వార్త వ‌చ్చిన వెంట‌నే, అన‌సూయ ఈ సినిమాలో కూడా ఏదో ఐట‌మ్ సాంగ్ చేస్తుందేమోలే అనుకున్నారంతా. లేదంటే ఏదైనా చిన్న క్యారెక్ట‌ర్ లో అన‌సూయ క‌నిపించ‌నుందేమో అనుకున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే అలా అనుకుంటున్న వారందరికీ అన‌సూయ గ‌ట్టి షాకే ఇచ్చింది. ఈ సినిమాలో త‌న పాత్ర పూర్తి స్థాయిలో ఉండ‌నుంద‌ని, క‌థ‌లో చాలా కీల‌కంగా త‌న పాత్ర ఉండ‌నుంద‌ని అంటుంది అన‌సూయ‌. సుకుమార్- చెర్రీ మూవీ అంటే మామూలుగానే క్రేజ్ ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి,  త‌నకు ఈ సినిమా త‌ర్వాత క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయ‌మ‌ని భావిస్తోంది అన‌సూయ‌.