Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Amma Rajasekhar Celebrate His Birthday In Orphanage


Amma Raja Shekar..The man with dual talent both choreography & Direction celebrating his birth day today in Hyderabad. He celebrated his birth day with his family in an orphanage near Bollaram. Amma Rajashekar says " i feel blessed to celebrate my birth day with my mom & so many mothers who are living here,i always have their best wishes with me. Thank you every one in the industry , Directors, Producers,Audience for supporting me to be in this position ". Amma Rajashekar first he was introduced as a Choreographer & he proved himself as a director by Ranam movie. He is a fame Choreographer & director in both Telugu & Tamil Industry. Now he is directing a new film with Hero Srikanth ," Ghost Is secret of My Energy " is their new movie. Shooting is about to finish & further details will be declared soon by the team. He wished Telugu Tamil Audience will encourage him further and take him to heights of industry.

వృద్ధాశ్ర‌మంలో అమ్మ రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు వేడుక‌లు
కొరియోగ్రాఫర్‌గా మొద‌ట తన సత్తా ఏమిటో చూపి, రణం సినిమాతో దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్న ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, దర్శకుడు అమ్మ రాజశేఖర్‌. ఈరోజు ఆయ‌న పుట్టినరోజు వేడుక‌ల‌ను హైదరాబాద్‌ లోని బొల్లారం వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ..'ఇప్పటి వరకు నాకు సపోర్ట్‌ చేసిన తెలుగు, తమిళ సినిమా దర్శకనిర్మాతలకు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అమ్మగారి సమక్షంలో, ఇక్కడ ఎందరో అమ్మల మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మతో పాటు, ఇక్కడున్న ఎందరో అమ్మల ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో నా సినిమాలు రూపొందుతున్నాయి. శ్రీకాంత్‌ హీరోగా తెలుగులో నేను చేస్తున్న 'ఘోస్ట్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ' షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తాను. దర్శకునిగా మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాను. తప్పకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులు ఇలాగే ఆదరిస్తుంటారని ఆశిస్తున్నాన‌న్నారు.