నవంబ‌ర్ 24న `అల్లుడు సింగం`


షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అంజ‌లి రెండు షేడ్స్‌లో న‌టించిన చిత్రం `అల్లుడు సింగం`. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా రూపొందుతోన్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ ` తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...
నిర్మాత రావిపాటి స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ``పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతో్న్న‌ “అల్లుడు సింగం` సినిమాలో సరికొత్త గ్లామ‌ర్ లుక్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమాలో చేయ‌ని విధంగా లాయ‌ర్‌, పొలిటీషియ‌న్‌గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డనుంది. ల‌వ్‌, యాక్ష‌న్ స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి న‌ట‌న‌, క‌మెడియ‌న్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ‌గారి సినిమా టైటిల్స్‌తో `వ‌చ్చాడు వ‌చ్చాడు బొబ్బిలిసింహం` పాట‌ను ప్ర‌త్యేకంగా రాయించాం.  ప్ర‌స్తుతం సినిమా అన్నీ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ న‌వంబ‌ర్ 24న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది`` అన్నారు. 
ఈ చిత్రానికి సంగీతంః ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్‌, మాట‌లుః వెంక‌ట్‌, నిర్మాతః రావిపాటి స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌కుడుః రాజ‌శేఖ‌ర్‌.