స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌


`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. 


ఈ సంద‌ర్బంగా 

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్ నుండి సినిమా వ‌స్తుంద‌న‌గానే ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి అంచ‌నాలుంటాయి. అలాంటిది ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్ మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా కావ‌డం ఒక‌టైతే, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ చేస్తుండ‌టం, `ఆర్య‌`, `బ‌న్ని`, `ఆర్య‌2`, `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాలు కమ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్‌హిట్ కావ‌డ‌మే కాదు, మ్యూజికల్‌గా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి అలాంటి హిట్ కాంబో బ‌న్ని, దేవి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  మేం కూడా చాలా ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. ఇటు ప్రేక్ష‌కులు, అభిమానులే కాదు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు అతృత‌గా ఎదురుచూస్తున్న డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఫ‌స్ట్‌లుక్‌ను ఈ రోజు విడుద‌ల చేశాం. అలాగే మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ఈ చిత్రాన్ని అన్ కాంప్ర‌మైజ్డ్‌గా తెర‌కెక్కిస్తున్నాం`` అన్నారు.

 

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: ఛోటా కే ప్రసాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డీ, దీపక్‌ రాజ్‌ నిర్మాత: దిల్‌రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.