Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Allu Arjun Suggestion to Mega Fans


అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అల్లుఅర్జున్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ పై వీరంగం ఒక్క మెగా అభిమానులకే కాదు అందరికి షాక్ ఇచ్చింది. మెగా ప్రిన్సెస్ నిహారిక మొద‌టి సినిమా ఒక మనసు ఆడియో వేడుకకు అతిధులుగా వచ్చిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ముందు సినిమా ఆడియో విశేషాల గురించి మాట్లాడి అందరిని విష్ చేసిన బన్నీ.. ఆ తర్వాత అసలు మ్యాటర్ గురించి, అదే పవన్ గురించి తాను మాట్లాడేది లేదు అన్న విషయం గురించి మాట్లాడాడు. కొంత కాలంగా పవన్ ఫ్యాన్స్ కొంద‌రు వేదిక ఏదైనా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ కేకలు వేస్తున్నారు. దీనికి హర్ట్ అయిన అల్లు అర్జున్ మెగాస్టార్ తర్వాతే ఏ మెగా హీరో అయినా అన్న మాట మరోసారి గట్టిగా చెప్పాడు. అంతేకాదు బయట ఆడియోల్లో కూడా ఈ పిచ్చి అభిమానం తమ పరువుని తీస్తుందని అన్నాడు. మెగాస్టార్ మాట్లాడేప్పుడు కూడా తనని మాట్లాడనివ్వకుండా పవర్ స్టార్ అని మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నాడు. మూడు హిట్లు కొట్టాడు ఇప్పుడు ఏం మాట్లాడిన తప్పుగా ఆలోచించే అవకాశం ఉంది. కాని ఇలానే చూస్తూ ఊరుకోలేక ఇలా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు అల్లు అర్జున్. ఫ్యాన్స్ ను గౌరవిస్తూనే మీరు దిగజారొద్దు మమ్మల్ని దిగజారనివ్వొద్దు అని అల్లు అర్జున్ అన్నాడు. దర్శకుడు మాట్లాడేప్పుడు కూడా మీరు మాట్లాడనివ్వక పోవడం అతన్ని అవమానించినట్టే అని ఫైర్ అయ్యాడు. చివ‌ర‌గా మెగాస్టార్ కోసమే తాను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని.. మెగా అభిమానులు తప్పు చేస్తే అది ప్రతి ఒక్క మెగా హీరో మీద ఎఫెక్ట్ అవుతుందని అన్నాడు. ఒక మనసు ఆడియో వేడుక పవన్ ఫ్యాన్స్ కు బన్ని క్లాస్ పీకేందుకే అన్నట్టు కొద్దిసేపు కనిపించింది. కడగాల్సినదంతా కడిగేసి నా బాధను అర్ధం చేసుకుంటారని అంటూ అభిమానులను కవిన్స్ చేసే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్.