మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్న అల్లు అర్జున్


ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా పూర్తయిన వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు . ఈ సినిమాకి టైటిల్ ' నా పేరు సూర్య " అనుకుంటున్నారు. ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. విశాల్ శేఖర్ సంగీతం అందించనున్నాడు.


ఈ చిత్రంలో అల్లు అర్జున్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల్లో కొత్తగా కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ సరసన నటించేందుకు హీరోయిన్లు దిశా పటాని లేదా కైరా అద్వానీ ల పేర్లు పరీశీలిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ జూన్ లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.