అర్జున్ మ‌ళ్లీ అదే ఫాలో అవుతున్నాడు.


స‌రైనోడు త‌ర్వాత, అల్లుఅర్జున్ ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ డైర‌క్ష‌న్ లో చేస్తున్న సినిమా డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లైమాక్స్ మిన‌హా మొత్తం కంప్లీట్ అయిన‌ట్లే. రీసెంట్ గా జ‌రిగిన అబుదాబి షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న షెడ్యూల్ కు గ‌త `10 రోజులుగా బ‌న్నీ హాజ‌రు కావ‌డం లేదు. 

ఏప్రిల్ నెల మొద‌లు నుంచి, త‌న కొడుకు పుట్టిన రోజు అంటూ, త‌న పుట్టిన రోజు అంటూ గోవా లో ఎంజాయ్ చేస్తుంది బ‌న్నీ ఫ్యామిలీ. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ రోజు హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, ప‌ని చూసుకుని వెంట‌నే మ‌ళ్లీ గోవాకు ఎగిరిపోయాడు బ‌న్నీ. అస‌లు సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మయంలో, బ‌న్నీ క్లైమాక్స్ షూటింగ్ ను వ‌దిలేసి మ‌రీ అక్క‌డ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే దీనికి అస‌లు కార‌ణం వేరే ఉందిలెండి. హ‌రీష్ శంక‌ర్ రాసిన క్లైమాక్స్ మ‌న బ‌న్నీ కి న‌చ్చ‌క‌పోవడంతో, దాన్ని మ‌ళ్లీ రీరైట్ చేసే ప‌నిలో హ‌రీష్ శంక‌ర్ ఉండ‌గా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ప‌నిలో బ‌న్నీ ఉన్నాడు.

గ‌తంలోనూ రేసు గుర్రం, స‌రైనోడు సినిమాల విష‌యంలోనూ బ‌న్నీ ఇదే చేశాడు. ఇప్ప‌డు డీజే కు కూడా క్లైమాక్స్ ను రీరైట్ చేయించి, హిట్ కొడ‌దామ‌ని మాంచి క‌సిలో ఉన్నాడు బ‌న్నీ. అంటే ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ కొత్త క్లైమాక్స్ రాసి, దానితో అల్లు అర్జున్ ని శాటిస్ఫై చేస్తేనే డీజే షూటింగ్ మ‌ళ్లీ తిరిగి స్టార్ట్ అవుతుంద‌న్న‌మాట‌.