మ‌ళ్లీ అంత ప‌ని చేయ‌నున్న అల్లు అర్జున్


ఏదైనా చేయ‌డం, చేసి చూపించ‌డంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందే ఉంటాడు.పండ‌గ‌ల‌కు విషెస్ చెప్ప‌డం లోనైనా, త‌న కొడుకు కు సంబంధించిన ఏ చిన్న ఫొటోనైనా షేర్ చేసే ముందు అల్లు హీరో ప్ర‌త్యేకంగా ఫొటో షూట్ లు చూసి, ఆ త‌ర్వాత‌నే స్పెష‌ల్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం బ‌న్నీకి అల‌వాటు. గ‌తంలో ఇలాగే త‌న కొడుకు అయాన్ ను అంద‌రికీ చూపించ‌డానికి, రిప‌బ్లిక్ డే, హోలీ స‌మ‌యాల్లో అయాన్ కు స్పెషల్ గెట‌ప్ వేసి మ‌రీ ఫొటోలు తీయించి ,షేర్ చేసిన విష‌యం తెలిసిందే. 1ఇక రీసెంట్ గా త‌న భార్య గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు కూడా.. స్పెష‌ల్ గా ఓ ఫొటోషూట్ పెట్టి, త‌న భార్యా కొడుకుతో ఒక సూప‌ర్బ్ పోజ్ తో ఉన్న ఫొటోతో ... స్నేహ మ‌రో బిడ్డ‌కు జ‌న్మ ఇవ్వ‌నుంద‌న్న విష‌యాన్ని చెప్పిన బ‌న్నీ- స్నేహ దంప‌తులు రెండు రోజుల క్రిత‌మే ఆడ‌శిశువుకు జ‌న్మనిచ్చారు. ఒక కొడుకు, ఒక కూతురు ఇంత‌కంటే ఎక్కువ ఏం కోరుకుంటాం, చాలా హ్య‌పీగా ఉంది అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్ మ‌ళ్లీ త్వ‌ర‌లోనే త‌న కూతురిని అభిమానులంద‌రికీ చూపించ‌డానికి ఫొటోషూట్ ఏర్పాటు చేయ‌నున్నాడు.ll మ‌రి ఆ బుల్లి అల్లు వార‌సురాలి ఫొటో అయాన్ తో ఉంటుందో, అల్లు అర్జున్ తో ఉంటుందో లేదా టోట‌ల్ అల్లు ఫ్యామీలీ తో క‌లిసి ఉంటుందో చూడాలి. m https://www.youtube.com/watch?v=0AwS53mUryo