అల్ల‌రి న‌రేష్ కోసం మ‌హేష్ వెయిటింగ్


బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ త‌ర్వాత మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగుదాస్ డైర‌క్ష‌న్ లో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన వెంటనే కొర‌టాల ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు మ‌హేష్. మే నుంచి ఆ సినిమాను మొద‌లుపెట్టేయ‌నున్నాడు కూడా, కొర‌టాల సినిమా పూర్త‌యిన వెంట‌నే వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌డానికి మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

వంశీ పైడ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న సినిమాలో ఒక కీల‌క పాత్ర కోసం అల్ల‌రి న‌రేష్ ను సంప్ర‌దించి, దానికి సంబంధించిన డీటైల్స్ కూడా చెప్పేశాడ‌ట వంశీ. ఆ పాత్ర‌కు అల్ల‌రి న‌రేష్ అయితే క‌రెక్ట్ గా సెట్ అవుతాడ‌ని వంశీ కి మ‌హేష్ బాబే చెప్ప‌డం విశేషం. ఈ కాంబినేష‌న్ సెట్ అవుతుందో లేదో ఇంకొన్ని రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. 

అస‌లు ఇంకా సినిమానే మొద‌లు కాని నేప‌థ్యంలో, అప్పుడే కాస్టింగ్ గురించి ఫైన‌లైజ్ చేసేస్తున్నారు మీడియా మిత్రులు. సినిమా మొద‌లుపెట్ట‌డానికి ఇంకా ఏడెనిమిది నెల‌లు ఉండ‌గా, అల్ల‌రి న‌రేష్ ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి ఒప్పుకుంటే, వంశీ ఫైన‌ల్ స్క్రిప్ట్ రెడీ చేసేసుకోవ‌చ్చు అనే ఆలోచ‌నలో ఇంత ముందుగానే సంప్ర‌దించాడ‌ని చెప్పుకుంటున్నారు.