"విన్న‌ర్" చిత్రం ద్వారా ప‌రిచ‌యం కానున్న పీట‌ర్‌ హెయిన్స్


పీట‌ర్ హెయిన్స్ పేరు విన‌గానే యాక్ష‌న్ గుర్తొస్తుంది, కాని "విన్నర్" చిత్రం చూస్తే న‌వ్వోస్తుంది. విభిన్న‌మైన పాత్ర‌లు, విచిత్ర‌మైన గెట‌ప్స్ తో కామెడి కి బ్రాండ్ అంబాస‌డ‌ర్ గా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్డ్ గా ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తున్న ప్ర‌ముఖ కామెడి న‌టుడు ఆలీ "విన్న‌ర్" చిత్రంలో పీట‌ర్ హెయిన్స్ గా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. అంతేకాదు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ వున్న ఈ చిత్రంలో ఆలీ పోషించిన పీట‌ర్ హెయిన్స్ పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్ నుండి త‌న‌దైన శైలిలో న‌వ్వించారు. ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని అల‌రించి సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో మ‌రో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. దీనికి యాక్ష‌న్ తో పాటు వెన్నెల కిషోర్‌, 30 ఇయ‌ర్స్ పృథ్వి, ఆలీ లు విభిన్న‌మైన పాత్ర‌లు చేసి ఆద్యంతం న‌వ్వులు కురిపించారు.


సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న యు.స్ లో 100 ధియోట‌ర్స్‌లో  విడుదలకానుంది.  


సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.