Akhil Next With Hanu Raghavapudi?


AKHIL AKKINENI... Fans of Akhil are waiting for his Second movie..But Akhil is not declaring any news about his next project. But there were talks roaming in TFI that Vamsi Paidipalli is going to direct Akhil's Second movie,due to some budget issues this project went into halt. Again rumors took wind on Akhil ,This time it is director Hanu Raghavapudi fame Director of 'Andala Rakshasi' & 'Krishna Gadi Veera Prema Gadha ' is now going to tie up with Akhil. Hanu Raghavapudi is well known for directing films in low budget & hitting box office with high openings , as well as directing youth full entertainers. So, Akhil is showing interest to direct with this young director for his next success, If this is finalized then Akhil's second movie will be under Annapurna Banner. Let's wait & watch which will be finalized by Akhil this time.   అఖిల్ త‌న రెండో సినిమా విష‌యంలో ఇదిగో అదిగో అనే వార్త‌లే త‌ప్పించి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఓకే అవ‌లేదు. దీంతో ఆయ‌న అభిమానులంతా ఎప్పుడెప్పుడు అఖిల్ ఆ తీపి క‌బురు చెబుతాడా అని ఎదురుచూస్తున్నారు. వంశీ పైడిప‌ల్లితో అఖిల్ సినిమా దాదాపు ఫైన‌ల్ అయిపోయిన‌ట్లే అని వార్త‌లు మొన్న‌టి వ‌ర‌కు షికారు చేశాయి. దానికితోడు అఖిల్ కూడా వంశీతో త‌న సినిమా ఉంటుంద‌ని చెప్ప‌డంతో అంద‌రూ నిజ‌మే అనుకున్నారు. కానీ బ‌డ్జెట్ ప‌రంగా ఆలోచ‌న‌లో ప‌డ్డార‌నే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో వార్త ఫిల్మ్ నగర్లో పరుగులు తీస్తోంది. 'అందాల రాక్షసి' , 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాలతో సూప‌ర్ హిట్లు కొట్టిన హ‌ను రాఘ‌వ‌పూడితో సినిమా చేయ‌డానికి అఖిల్ ఆస‌క్తి చూపుతున్నాడని అంటున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తూ, తక్కువ బడ్జెట్ తో భారీ వసూళ్లు రాబట్టడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అందువలన ఆయనతో సినిమా చేస్తే బాగుంటుందని అఖిల్ భావిస్తున్నాడట. హను రాఘవపూడి సినిమా అంటే ఒక మాదిరి బడ్జెట్ ఉంటుంది కనుక, అన్నపూర్ణ బ్యానర్ పైనే ఈ సినిమా ఉండవచ్చనే టాక్ అయితే వినిపిస్తుంది. చూద్దాం అఖిలే త‌న రెండో సినిమా గురించి చెప్తా అన్నాడుగా..