Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Akhil Next With Hanu Raghavapudi?


With his first film he came with huge expectations and got a huge disaster with 'Akhil' at the box office who is in news about his next movie details like when will the movie start? Who is the director? Who is the producer? All these questions confusing akkineni fans. Few days back a news surrounded that Akhil is working with Vamsi paidipally who gave success to Nagarjuna with Oopiri this year but with some reasons vamshi left this project.
After that Koratala Shiva and Hanu Ragavapudi names came on screen. now the latest news is that Akhil accepted to work with Hanu Ragavapudi for his next film. Akhil liked his freshness in the movies like Andala Rakshasi and Krishna gadi veera prema gadha and gave green signal to him. A final sitting is placed in a week with this Akhil comes to a decision.
హను రాఘ‌వ‌పూడితోనే సిసింద్రీ..?
మొద‌టి సినిమాకే ఒక రేంజ్ లో ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ చేసి, బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక డిజాస్ట‌ర్ గా నిలిచిన అఖిల్ త‌న రెండ‌వ సినిమా గురించి ఈ మ‌ధ్య బాగానే వార్త‌ల్లోకెక్కాడు. అస‌లు అఖిల్ రెండ‌వ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది? డైర‌క్ట‌ర్ ఎవ‌రు? ప్రొడ్యూస‌ర్ ఎవ‌రు? మిగ‌తా విష‌యాలు ఇలా అనేక ప్ర‌శ్న‌లు చాలా రోజులుగా అక్కినేని అభిమానుల‌ను ఆలోచింప‌చేస్తున్నాయి. ఈనేప‌థ్యంలోనే త‌న తండ్రికి ''ఊపిరి''నిచ్చిన వంశీ పైడిప‌ల్లికి అఖిల్ రెండ‌వ సినిమా డైర‌క్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చింద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చిన‌ప్ప‌టికీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకున్నాడనే టాక్ కూడా వినిపించింది.
ఆ త‌ర్వాత మిర్చి, శ్రీమంతుడు వంటి బ్లాక్ బ్ల‌స్టర్స్ ఇచ్చిన కొర‌టాల శివ‌, హ‌ను రాఘ‌వ‌పూడి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఇప్పుడు తాజాగా హ‌ను రాఘ‌వ‌పూడితో చేయ‌డానికే అఖిల్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌న్న టాక్ ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తోంది. ''అందాల రాక్షసి'', ''కృష్ణ‌గాడి వీర‌ప్రేమ గాథ'' సినిమాల్లో ఆయ‌న చూపించిన కొత్త‌ద‌నం అఖిల్ కి బాగా న‌చ్చ‌డంతో అఖిల్ ఈ సినిమాకే ఫిక్స్ అవుతున్నాడ‌ట‌. ఓ వారం రోజుల్లో హ‌ను రాఘ‌వ‌పూడితో అఖిల్ ఫైన‌ల్ సిట్టింగ్ ఉంటుంద‌నీ, దీంతో అఖిల్ ఒక నిర్ణ‌యానికి వ‌స్తాడ‌ని అంటున్నారు.