అఖిల్ కు విల‌న్ క‌న్ఫార్మ్ అయ్యాడు


మొద‌టి సినిమాతోనే ఏ హీరో సాధించలేని క్రేజ్ ను ద‌క్కించుకున్న అఖిల్ త‌న మొద‌టి సినిమా అఖిల్ తోనే ఘోర ప‌రాజయాన్ని అకౌంట్ లో వేసేసుకున్నాడు. అఖిల్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ రీసెంట్ గానే త‌న రెండ‌వ సినిమాను విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లెట్టేశాడు. ఈ నెల 4 వ తేదీ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకు ప్ర‌స్తుతం అఖిల్ పై యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా మొద‌లు పెట్ట‌డం అయితే మొద‌లుపెట్టారు కానీ, మిగ‌తా తార‌గ‌ణం గురించి మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప్ర‌క‌ట‌న చేసింది లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాలో అఖిల్ కి పోటీగా, విల‌న్ గా అజ‌య్ న‌టించ‌నున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. విక్ర‌మ్ కుమార్, అజ‌య్ లు ఎప్ప‌టినుంచో మంచి స్నేహితులు కావ‌డం, గ‌తంలో ఇష్క్, 24 వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న అజ‌య్ కు ఈ సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ గురించి చెప్ప‌గానే, వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తుండ‌గా, ఈ సినిమాకు ఎక్క‌డ ఎక్క‌డ ఎక్క‌డ ఉందో తార‌క అనే టైటిల్  ప‌రిశీల‌న లో ఉంది.