Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

ఈ ఏడాది 'క్ష‌ణం' కూడా తీరిక ఉండ‌దేమో


త‌మిళంలో ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై  సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న చిత్రం `చ‌దురంగ వేట్టై` తెలుగులో రీమేక్ అవుతోంది.  ఇటీవ‌లే `జెంటిల్‌మ‌న్`తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తోంది.
 
`క్ష‌ణం`తో హీరోగా ఒక ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తెచ్చుకుని  ప్ర‌స్తుతం ప‌లు  చిత్రాల్లో న‌టిస్తున్న  అడివి శేష్ ఇందులో క‌థానాయ‌కుడు.  `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` ఫేమ్ నందితా శ్వేత నాయిక‌గా ఎంపిక‌య్యారు.   శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ ప‌తాకంపై ర‌మేశ్‌.పి.పిళ్లై  నిర్మిస్తున్నారు.  గోపీ గ‌ణేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.  వ‌సంత పంచ‌మిని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం హైద‌రాబాద్‌లోని సినిమా కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయని. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని,  జులైలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.  ఈ చిత్రానికి మాట‌లు :  కిర‌ణ్ త‌ట‌వ‌ర్తి.