Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

న‌వంబ‌ర్ 4 న 'ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'


రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నటించిన 'భాహుబ‌లి' చిత్రంతో కాళ‌కేయ గా  సినిమా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందిన ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన వైవిధ్య‌మైన చిత్రం 'ఆవు పులి మ‌ద్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి'..  ఈచిత్రాన్ని సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి మ‌రియు శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్పిస్తున్నారు. రెడ్ కార్పెట్ రీల్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 4 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడ‌దల కానుంది. 
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు చైత‌న్య‌ మాట్లాడుతూ..  ఈచిత్రానికి ఎన్నోర‌కాల టైటిల్స్ అనుకున్నాము. కాని ఈటైటిల్ క‌థ‌కి యాప్ట్ అని ఫీల్ అయ్యి యూనిట్ అంద‌రం పెట్టాము. చిత్రం చూసిని త‌రువాత అంద‌రూ చాలా ఢిఫ‌రెంట్ గా వుంద‌ని మాత్రం అంటారు. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ పార్మెట్ లో కామెడి ఈ చిత్రంలో చూడోచ్చు.. స‌హ‌జంగా తెలుగు చిత్రాల్లో హీరో నో , హీరోయిన్ నో ప్రేమ వైఫ‌ల్యం చెంద‌టం తో క‌థ మెద‌లవుతాయి.. కాని ఓ విల‌న్ ప్రేమ వైఫ‌ల్యాల నుండి క‌థ ప్రారంభం చేసిన మెట్ట‌మెద‌టి చిత్రం మా 'ఆవు పులి ప్ర‌భాస్ పెళ్ళి'.. అందుకే దీనికి క్యాప్ష‌న్ ని కూడా 'ఇది యధార్థ క‌థ కాదు' అని పెట్టాం. అయితే ఈ చిత్రంలో నెల్లూరు లోని రియ‌ల్ రౌడిలు న‌టించారు. కొత్త త‌రం ప్రేమ‌క‌థ‌ని కొత్త త‌రం కామెడితో తెల‌గులో ఇప్ప‌టివ‌ర‌కూ రాని విధంగా చాలా లిమిటెడ్ బ‌డ్జెట్ లో నిర్మించాం. ఈ చిత్రం యోక్క టీజ‌ర్ కి ఆడియో కి మంచి రెస్పాన్స్ రావ‌టంతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి లోని పెద్ద‌ల స‌పోర్టుతో ట్రేడ్ బిజినెస్ కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుంది. న‌వంబ‌ర్ 4న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు.
ఏ.ర‌వితేజ‌, అశ్వ‌ని, భాను, కాళ‌కేయ ప్ర‌భాక‌ర్‌, మ‌ధుమ‌ణి, జ‌బ‌ర్డ‌స్త్ వేణు, ప్ర‌భాక‌ర్ మ‌రియు ముఖ్య‌తారాగాణం న‌టించారు
స‌మ‌ర్ప‌ణ‌- సూర్య‌దేవ ఫిల్మ్ కార్పోరేష‌న్ గుడి వంశిధ‌ర్ రెడ్డి మ‌రియు శ్రీమ‌తి శైల‌జ , బ్యాన‌ర్‌- రెడ్ కార్పెట్ రీల్స్ సంగీతం-ఎం.టి.క‌విశంక‌ర్‌, కెమెరా- ఆర్లి, స‌హ‌నిర్మాత‌లు- న‌గ‌రం సునిల్‌, మ‌ధుమణి నాయుడు, నిర్మాత‌- ర‌వి ప‌చ్చిపాల‌, ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం - ఎస్‌.జె.చైత‌న్య