Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

A Book On Jyothi Lakshmi Movie


పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఛార్మి టైటిల్ రోల్ పోషించిన జ్యోతిల‌క్ష్మి చిత్రాన్ని విమ‌ర్శ‌నాత్మ‌కంగా మంగ‌ళ‌గౌరీ  రాసిన పుస్త‌కం విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి త‌నికెళ్ల‌భ‌ర‌ణి ముఖ్య అతిథిగా హాజ‌రై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ ``పీహెచ్‌.డి అవార్డు చేయ‌ద‌గిన స్థాయిలో ఈ పుస్త‌కాన్ని రాశారు మంగ‌ళ‌గౌరీ .జ్యోతిల‌క్ష్మి సినిమాకు కావ్య‌గౌర‌వం క‌ల్పించిన మంగ‌ళ‌గౌరీ అభినంద‌నీయురాలు`` అని అన్నారు. ఛార్మి మాట్లాడుతూ.. ''పుస్త‌కంతో మొద‌లైన ఈ సినిమా పుస్త‌కంతోనే ఎండ్ అవుతోంది. పూరిగారు స్ఫూర్తితో తీశారు. నాకు తెలుగు చ‌ద‌వ‌డం రాదు. ఎక్క‌డికివెళ్లినా న‌న్ను జ్యోతిల‌క్ష్మి అనే పిలుస్తున్నారు`` అని తెలిపారు. మంగ‌ళ‌గౌరి మాట్లాడుతూ.. ''మ‌ల్లాదివారితో మాట్లాడే పూరి ఈ చిత్రాన్ని చేశారు. ఆధునిక క‌న్యాశుల్కం అని నేను జ్యోతిల‌క్ష్మి గురించి చెబుతాను. భ‌విష్య‌త్తులోనూ పూరి జ‌గ‌న్నాథ్ చిత్రాల గురించి, ఛార్మి గురించి పుస్త‌కాలు రాయ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నాను`` అని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో టార్జాన్‌, గాయ‌త్రి, అపూర్వ‌, సునీల్ క‌శ్య‌ప్‌, శాండీ, పి.జి.విందా, స‌త్య‌దేవ‌, ఆకాష్ పూరి త‌దిత‌రులు పాల్గొన్నారు.