Latest News

`జూన్ 1: 43` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి, జూన్‌లోనే రిలీజ్‌! డీజే అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది : పూజ హెగ్డే తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న 'ఆనందో బ్రహ్మ' ఇన్నోవేటివ్ మోషన్ పోస్టర్ అన్ని ఏరియాల స్పంద‌న అద్భుతం- `ఓ పిల్లా నీ వ‌ల్లా` ద‌ర్శ‌క‌నిర్మాత కిషోర్‌ సునీల్ 'ఉంగరాల రాంబాబు' జూన్ లో విడుదల `అంధ‌గాడు` సెన్సార్ పూర్తి.. జూన్ 2న విడుద‌ల గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' జూన్ 9 న విడుదల 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రాజ‌శేఖ‌ర్‌ 'గరుడ వేగ 126.18 ఎమ్' జూన్ 2న వ‌స్తున్న `వెక్కిరింత‌`విడుదల ఒకేసారి రెండు మల్టీ స్టారర్ సినిమాలు కలిసి చేస్తున్న సుధీర్ బాబు & నారా రోహిత్

A... Aa , a Story Of Three Parts


ఆయ‌న మాట్లాడితే ఎంత సేపైనా వినాల‌నిపిస్తుంది. అదే సినిమా తీస్తే క‌న్నార్ప‌కుండా చూడాల‌నిపిస్తుంంది. మాట‌ల‌ను తూటాలుగా పేల్చ‌డంలో ఆయ‌న త‌ర్వాతే. అ..ఆ.. వినడానికి చాలా వింతగా అనిపించే టైటిల్. తెలుగు వర్ణమాలలో తొలి రెండు అక్షరాలనే టైటిల్ గా మార్చేసాడు త్రివిక్రమ్. మొదట్లో ఈ టైటిల్ విన్నపుడు చాలా విచిత్రంగా అనిపించింది. అయితే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అంటూ దానికి ఓ అర్థం కూడా చెప్పడంతో సూపర్ టైటిల్ అన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆడియో,  ట్రైలర్ విడుద‌ల‌య్యాయి. ఎప్పట్లాగే ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఆడియో వేడుకలో నితిన్ చెప్పినట్లు అ..ఆ.. అంటే అందంగా ఆహ్లాదకరంగా అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. సినిమాని మూడు ముక్కల్లో చెప్పాడు త్రివిక్రమ్. ప్రతీ కధకు ఓ బిగినింగ్. ఓ ట్విస్ట్. ఓ ఎండింగ్. సమంత నితిన్ ను రైల్వే స్టేషన్ లో కలుసుకోవడం బిగినింగ్. వారి ప్రేమ ప్రాబ్లంలో పడటం ట్విస్ట్. ఇక ఎండింగ్ వెండితెరపైనే చూడాలి. సమంత అల్లరి.. అనుపమ అప్పియరెన్స్.. నితిన్ లుక్స్ అన్నీ ట్రైలర్ లో బాగా పండాయి.కానీ త్రివిక్రమ్ అభిమానుల నుంచి ఆశించే పంచ్ డైలాగులు మాత్రం ఈ ట్రైలర్ లో మిస్ అయ్యాయి. ఆడియో ఫంక్షన్ లో పవన్ నితిన్ గురించి మాట్లాడారు. నితిన్ కి తానంటే అంతిష్టమని తెలియదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఈ రోజు చెప్పేంతవరకు తనకు తెలియదని ఆయన అన్నారు. నితిన్ ని మొదట చూడగానే తనకు చాలా ప్రేమగా, తన తమ్ముడిలా అనిపించాడని అందుకే నితిన్ 'ఇష్క్' సినిమా ఆడియోకు వచ్చానని అన్నారు కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అ..ఆ ను తెరకెక్కించాడు త్రివిక్ర‌మ్. తాను ఎప్పుడో రాసుకున్న కథకు ఇప్పుడు రూపం ఇచ్చానని చెప్పాడు మాటల మాంత్రికుడు. మరి అప్పుడెప్పుడో రాసుకున్న కథ.. ఇప్పటి ప్రేక్షకులకు ఎక్కుతుందా..? అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో రొటీన్ గా కనిపించే త్రివిక్రమ్ మార్క్ ఫన్ మిస్ అయిందా అనే అనుమానం ఈ ట్రైలర్ చూసిన వారికి కలుగుతుంది. ఏది ఏమైనా తెలుగు అక్షరాలూ మరిచిపోతున్న నేటి యూత్  కు తెలుగు అక్షరాలు అ..ఆ ను గుర్తు చేస్తూ త్రివిక్రమ్ ఒక మంచి సినిమా తీసాడు అనుకోవాలి Watch A Aa Trailer https://www.youtube.com/watch?v=V4KdbX1xvaI