శ్రీమంతుడు సినిమా నాకు నచ్చలేదు


తెలుగు ప్రేక్షకులకి 'థర్టీ ఇయర్స్ ఇండస్ర్టీ ఇక్కడ'  అంటూ బాగా సుపరిచితుడు అయినా పృథ్వి రాజ్ ఒక సంచల వ్యాఖ్య చేసాడు. కాకపోతే అది సినిమాలో లెండి... శ్రీను వైట్ల దర్శకత్వంలో శుక్రవారం రిలీజ్ అయిన 'మిస్టర్' సినిమాలో కమెడియన్ గా నటించిన పృథ్వి రాజ్ ప్రేక్షకులని నవ్వించటం కోసం ఈ సంచల వాఖ్య చేసాడు. ఈ మూవీలో  దర్శకుడిగా ఓ పాత్ర పోషించిన పృథ్వి రాజ్ తనకు అసిస్టెంట్ డైరెక్టర్  శ్రీ మంతుడు సినిమా  స్టోరీ తనకి వినిపిస్తాడు... దానికి స్పందిస్తూ పృథ్వి రాజ్ ఇలాంటి స్టోరీ తీస్తే జనాలు ఎవడు చూస్తాడయ్యా... హీరో సైకిల్ పైన రావటం ఏంటి అంటూ గట్టిగానే రియాక్ట్ అవుతాడు. పృథ్వి రాజ్ ఈ సినిమాలో కామెడీ కోసం శ్రీమంతుడు లాంటి భారీ విజయం సాధించిన సినిమాని నచ్చలే అనటం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది