థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ ఇలాంటి క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తాడా..?


మొన్న‌టికి మొన్న ఒక చిన్న స‌న్నివేశం గురించి ఎటువంటి స‌మాచారం లేకుండానే త‌న సీన్ ను చిరంజీవి ప్ర‌తిష్టాత్మ‌క చిత్ర‌మైన ఖైదీ నెం150 సినిమా నుంచి తొల‌గించార‌ని, దానికి పండుగ రోజు మా అమ్మ చ‌నిపోయినంత బాధ‌గా ఉందని ఇంట‌ర్వూల్లో చెప్పిన పృథ్వీ ఇప్పుడు బాహుబ‌లి-2 గురించి ఒక కొత్త వ్యాఖ్య చేశాడు. బాహుబ‌లి-2, ప్ర‌భాస్ ఫ్యాన్స్, అనుష్క ఫ్యాన్స్, రాజ‌మౌళి ఫ్యాన్స్, త‌మ‌న్నా ఫ్యాన్స్, సినీ ల‌వ‌ర్స్, ఒక్క‌రేంట్ యావత్ ప్ర‌పంచమే ఎదురుచూస్తున్న సినిమా ఇది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌పంచానికి చాటిచెప్పిన రాజ‌మౌళి ప్రస్తుతం తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి2 సినిమ‌మాలో తాను కూడా న‌టిస్తున్నాన‌ని, దేవ‌సేన పాత్ర చేసిన అనుష్క‌కు తాను మంత్రిగా ఈ సినిమాల‌లో క‌నిపిస్తాన‌ని థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ తెలిపాడు. బాహుబ‌లి కంటే బాహుబ‌లి2 పైనే ప్రేక్ష‌కుల్లో ఎక్కువ అంచాన‌లున్నాయ‌ని, దేవ‌సేన సామ్రాజ్యంలో తాను కూడా ఒక‌డిన‌ని ఆయ‌న చెప్పాడు. అయితే అన్ని సినిమాల్లో లాగా, ఈ సినిమాలో త‌న‌ది కామెడీ క్యారెక్ట‌ర్ కాద‌ని, ఒక సీరియ‌స్ క్యారెక్ట‌ర్లోనే తాను క‌నిపిస్తాన‌ని చెప్పాడు పృథ్వీ. https://www.youtube.com/watch?v=e0Ii1rITJiw