Pawan Hot Comments On Bahubali


టాలీవుడ్ లోనే పెను సంచ‌ల‌నాల‌కు నాంది ప‌లికిన చిత్రం బాహుబలి.  రాజమౌళి రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన చిత్రం విజువ‌ల్ వండర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అందరిని మంత్ర ముగ్ధులను చేసింది. ఈ చిత్రంతో అప్పటి వరకు నామమాత్రంగా ఉన్న తెలుగు ఇండస్ట్రీ పేరు ఒక్కసారిగా భారత దేశం మొత్తం ఔరా అనిపించేలా చేసింది. అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు గెలుచుకుంది. అయితే ఈ చిత్రంపై తాజాగా ఓ స్టార్ హీరో  సంచలన వ్యాఖ్యల‌తో బాహుబలి మ‌ళ్లీ టాలీవుడ్ లో పెద్ద సంచలనం అయ్యింది. బాహుబలి చిత్రం కంటే మగధీర చిత్రం చాలా బాగుందనీ.. ఆ సమయంలో బాహుబలికి చేసినంత ప్రచారం చేసి, సోషల్ మాద్యమాల ద్వారా పాపులారిటీ వచ్చి.. హిందీలో కూడా రిలీజ్ చేసి ఉంటే అంతకుమించిన పెద్ద హిట్ అయ్యేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.  ఈ చిత్రం కూడా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించడం,  రామ్ చరణ్ కి మ‌గ‌ధీర‌ రెండవ చిత్రం కావడం అప్పట్లో ఉమ్మ‌డి  రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. అంతే కాదు మన సినిమాలకు మార్కెట్ కూడా పెద్దగా లేదని అదే తమిళ సినిమాలు మాత్రం మన దగ్గర మంచి వసూళ్ళ ని సాధిస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు పవర్ స్టార్. తమిళ సినిమాలు మన దగ్గర భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయని.. మన సినిమాలు అక్కడ రిలీజ్ కావడమే కష్టంగా మారిందనీ ఒకవేళ రిలీజ్ అయినా అక్కడ అంతగా ప్రభావం చూపించడం లేదని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.