Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

`16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` ఫస్ట్ లుక్ లాంచ్‌


శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ నుంచి వ‌రుస‌గా స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు తెలుగులో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అదే కోవ‌లో ఇప్పుడు మ‌రో థ్రిల్ల‌ర్ మూవీని ప్ర‌ముఖ బ్యాన‌ర్లు, నిర్మాత‌ల‌తో పోటీప‌డి ఈ సంస్థ ద‌క్కించుకుంది.  `ధురువంగ‌ల్ ప‌దినారు` (డి-16) పేరుతో ఇటీవ‌ల రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ చిత్రాన్ని తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దిస్తున్నారు. మార్చిలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని  లాంచ్ చేశారు. 
16
ఈ సంద‌ర్భంగా చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ -``త‌మిళంలో ఇటీవ‌ల రిలీజై ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న `ధ‌రువంగ‌ల్ ప‌దినారు` చిత్రాన్ని తెలుగులో `16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దిస్తున్నాం. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న చిత్ర‌మిది. త‌మిళ‌నాట‌ ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. వాస్త‌వానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్ధేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాల‌నుకున్నారు. కానీ పోటీలో ఫ్యాన్సీ మొత్తాన్ని చెల్లించి చేజిక్కించుకున్నాం. ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెహ్మాన్ హీరోగా న‌టించారు. అలాగే ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతున్నారు.  సుజిత్ స‌రంగ్ కెమెరా వ‌ర్క్‌, జాకేష్ బిజోయ్ సంగీతం, రీరికార్డింగ్ హైలైట్‌. తెలుగు  ప్రేక్ష‌కుల్ని మెప్పించే అన్నిర‌కాల అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త అనుభూతినిచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి మార్చిలో సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.