Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

June: Young Heroes Month


Summer Bonanza shivered whole TFI with Star heroe's ... Pawan Kalyan with Sardar Gabbar Singh,Allu Arjun with Sarainodu ,Mahesh with Brahmotsavam,in between surya came from Kolly wood with his 24. at last SaiDharam Tej came with his Supreme & fulfilled top most list. Now June month is on it's way.. Young heroes are getting ready for the battle. Firstly Nithin is coming with his A..Aa.. movie on June2nd.Trivikram is directing this film & Trailer is very promising ,so expectations are in high sky for Nithin this season.It is very important for Nithin to re-write his own records at Box office to reach the goal. On June10th Hro Sumanth Ashwin is coming with his right..right movie,In this Bahubali Prabhakar is playing a positive role. Natural star Nani on the way with his  GentleMan under direction of Indraganti Mohana Krishna. on this June 17th Nani is going to shine on silver screen. with his previous hits of Bhale Bhale Magadivoi ,Krishna gadi veera prema gadha ,Nani's fans are expecting Gentleman to be a block buster in his career. Last but not least hero Naga shourya is coming with Oka Manasu ,In this film debut heroine Mega princess Niharika is sharing screen with Naga shourya. In this way June month is totally dedicated to Young dynamic heroes of TFI... Let's wait & watch who will score high this season.!!

జూన్ లో కుర్ర హీరోల హ‌డావుడి..
 
ఇంకో ఐదార్లోజుల్లో స‌మ్మ‌ర్ ఓవ‌ర్. ఈ ఎండాకాలం అంతా పెద్ద పెద్ద హీరోలు త‌మ సినిమాల‌తో బాగానే సంద‌డి చేశారు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స‌రైనోడిని అంటూ అల్లుఅర్జున్, బ్ర‌హ్మోత్సవాలు చేస్తా అంటూ మ‌హేష్ బాబు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. మ‌ధ్య‌లో సూర్య కూడా రోజుకు 24గంట‌లుంటాయ‌ని చెప్పడానికి కోలీవుడ్ నుంచి వ‌చ్చాడు.వీటన్నింటిలో సాయి ధ‌ర‌మ్ తేజ్ సుప్రీమ్ రిలీజ్ అయినా, స‌మ్మ‌ర్ మొత్తం బ‌డా హీరోలే నిల‌బ‌డ్డారు. ఇక జూన్ నెల వ‌స్తుంది. స‌మ్మ‌ర్ లో పెద్ద హీరోలు ఇండ‌స్ట్రీని ఏలితే జూన్ లో ముగ్గురు యంగ్ హీరోలు త‌మ స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.ముందుగా ఓన‌మాలు నేర్ప‌డానికి నితిని అ..ఆ అంటూ జూన్ 2న రానున్నాడు. మాట‌ల మాంత్రికుడి తెర‌కెక్కించిన మూవీ కావ‌డం, ట్రైల‌ర్ ప్రామిసింగ్ గా ఉండ‌టంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఖ‌ర్చు పెట్టిన మొత్తం సొమ్ము చేతికి రావాలంటే నితిన్ త‌న కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కంటే దాదాపు రెట్టింపు క‌లెక్ష‌న్స్ ను సంపాదించుకోవాలి. పోతే జూన్ 10న త‌ను క‌రెక్ట్ గానే వ‌స్తున్నా అంటూ రైట్ రైట్ తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు సుమంత్ అశ్విన్. మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ పాజిటివ్ రోల్ చేస్తుండ‌టం ఆస‌క్తి క‌లిగిస్తుంది. ఇక జూన్ 17న ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌ను తాను జెంటిల్ మెన్ గా నిరూపించుకోవ‌డానికి వ‌స్తున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. భ‌లేభ‌లే మ‌గాడివోయ్, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాధ స‌క్సెస్ లతో మంచి ఊపు మీదున్న నాని ఈ సినిమాతో త‌న సత్తా చాటాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పోతే జూన్ 24న త‌న మ‌న‌సు ఇవ్వ‌డానికి ఒక మ‌న‌సుతో నాగ‌శౌర్య వ‌స్తున్నాడు. మెగా హీరోయిన్ నిహారికి తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తం మీద జూన్ నెల‌ను కుర్ర హీరోలు ద‌త్త‌త తీసుకున్నార‌న్న‌మాట‌.