Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

''స‌ర‌సుడు'' గా శింబు


మొన్న.. 'మన్మథ', నిన్న.. 'వల్లభ', నేడు 'సరసుడు'. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో తమిళ్‌, తెలుగు భాషల్లో ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి సింగర్‌గా, డైరెక్టర్‌గా, మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌గా ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు యంగ్‌ ఛార్మింగ్‌ హీరో శింబు. లేటెస్ట్‌గా శింబు హీరోగా నటిస్తోన్న చిత్రం 'సరసుడు'. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్స్‌గా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌ దర్శకత్వంలో 'ప్రేమసాగరం' టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై టి.రాజేందర్‌ నిర్మించిన 'సరసుడు' చిత్రం అతి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. చాలాకాలం గ్యాప్‌ తర్వాత శింబు, నయనతార క్రేజీ కాంబినేషన్‌లో తమిళ్‌, తెలుగు భాషల్లో బైలాంగ్విల్‌లో రూపొందిన 'ఇదు నమ్మ ఆళ్‌' చిత్రం తమిళంలో సమ్మర్‌ కానుకగా రిలీజ్‌ అయి సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచి 27 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. నవంబర్‌లోనే రిలీజ్‌ కావలసిన ఈ చిత్రం డీమానిటైజేషన్‌ కారణంగా కొంత ఆలస్యమైనప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి 'సరసుడు' (ఎ లవర్‌ బోయ్‌) పేరుతో అతి త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. శింబు తమ్ముడు, టి.రాజేందర్‌ తనయుడు కురళఅరసన్‌ ఈ చిత్రానికి ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌నిచ్చాడు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ చిత్రం ఆడియోను సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌ చేస్తున్నారు. 'కుర్రాడొచ్చాడు' తర్వాత 'ప్రేమసాగరం' టి.రాజేందర్‌ ఈ చిత్రానికి మాటలు, పాటల్ని రాయడం విశేషం. కాగా ఫిబ్రవరి 3న హీరో శింబు బర్త్‌డే సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత టి.రాజేందర్‌ తెలియజేశారు.

ఐటి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరి!! నిర్మాత టి.రాజేందర్‌ మాట్లాడుతూ - ''శింబు, ఛార్మి జంటగా టి.రాజేందర్‌ మాటలు, పాటలు, సంగీత దర్శకత్వంలో రూపొందిన 'కుర్రాడొచ్చాడు' చిత్రం తర్వాత శింబు సినీ ఆర్ట్స్‌ బేనర్‌పై శింబు హీరోగా నటిస్తోన్న డైరెక్ట్‌ తెలుగు చిత్రం 'సరసుడు'. (ఎ లవర్‌బోయ్‌) అనేది క్యాప్షన్‌. ఐటి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని పాండిరాజ్‌ ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించారు. రియల్‌ లైఫ్‌లో ఐటి రంగంలో పని చేసే యువతీ యువకులు ఎలా లవ్‌ చేసుకుంటున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వుంటుంది. ప్రజెంట్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యేవిధంగా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రానికి మా చిన్నబ్బాయి, శింబు తమ్ముడు కురళ అరసన్‌ మ్యూజిక్‌ అందించాడు. ఐదు పాటలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. మ్యూజికల్‌గా ఆడియో చాలా పెద్ద హిట్‌ అవుతుంది. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో నటించారు. సత్యం రాజేష్‌ త్రో అవుట్‌ క్యారెక్టర్‌లో హీరో ఫ్రెండ్‌గా నటించాడు. అతను నటించిన సీన్స్‌ సూపర్బ్‌గా వచ్చాయి. మా శింబు సినీ ఆర్ట్స్‌ బేనర్‌లో కుర్రాడొచ్చాడు' తర్వాత రిలీజ్‌ అవుతున్న డైరెక్ట్‌ తెలుగు సినిమా ఇది. ఎంతో కేర్‌ తీసుకుని ప్రేక్షకులకి నచ్చేలా ఈ సినిమాని నిర్మించాం. కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగులో రిలీజ్‌ లేట్‌ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఆడియో రిలీజ్‌ చేసి, అతి త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. 'మన్మథ', 'వల్లభ' చిత్రాల కంటే 'సరసుడు' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ, సత్యం రాజేష్‌, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత: టి.రాజేందర్‌ ఎంఎ, సంగీతం: టి.ఆర్‌.కురళ్‌అరసన్‌, కెమెరా: బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్‌: ప్రవీణ్‌-ప్రదీప్‌, ఆర్ట్‌: ప్రేమ్‌ నవాజ్‌, కొరియోగ్రఫీ: సతీష్‌, రచనా-సహకారం: బోస్‌ గోగినేని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: వెంకట్‌ కొమ్మినేని, కో-ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌, నిర్మాత: టి.రాజేందర్‌ కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌