సురేష్ బాబు చేతులు మీదుగా “రాజా.. మీరు కేక” ట్రైలర్ లాంచ్


RK Studios “గుంటూరు టాకీస్” సినిమా తర్వాత నిర్మించిన రెండవ చిత్రం “ రాజా మీరు కేక “ థియేట్రిక‌ల్ ట్రైలర్ లాంచ్ ఈరోజు “రధ సప్తమి” సందర్బంగా ప్రముక నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత “ డా. సురేష్ బాబు” గారి చేతులు మీదుగా జరిగినది. ఈ సందర్బంగా సురేష్ బాబు గారు మాట్లాడుతూ ఈ సినిమా దర్శకులు కృష్ణ కిశోర్ తమ సంస్థలో పలు విజయవంతమైన చిత్రాలకు కో- డైరెక్టర్ గా పనిచేసారు. దర్శకుడిగా తన మొదటి సినిమా విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ, దర్శకులు కృష్ణ కిశోర్ గారికి, నిర్మాత రాజ్ కుమార్ గారికి మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులకు అబినందనలు తెలియచేసారు.

చిత్ర నిర్మాత రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ తమ మొదటి సినిమా గుంటూరు టాకీస్ విజయం తర్వాత నిర్మించిన “రాజా మీరు కేక” సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుందని మరియు తమ సంస్థకు మరొక అద్భుత విజయాన్ని అందిస్తుందని ఆసిస్తూ ఈ సినిమాలో నటించిన నటినటులు రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య శోభిత లకు మరియు ముఖ్య పాత్రలో నటించిన నందమూరి తారకరత్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ సినిమా థియేట్రిక‌ల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన డా. సురేష్ బాబు గారికి దన్యవాదాలు తెలిపారు.

చిత్ర దర్శకుడు కృష్ణ కిశోర్ గారు మాట్లాడుతూ తనను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న సురేష్ బాబు గారు తన మొదటి సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంఛ్ చేయడం ఎంతో సంతోషం కలిగించిందని చెబుతూ సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన నటినటులకు, సాంకేతిక నిపుణులకు దన్యవాదాలు తెలిపారు.

ఈ సినిమాలో నటించిన నటినటులు రేవంత్, నోయెల్, లాస్య మాట్లాడుతూ మంచి సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారని, ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, తమకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కుమార్ గారికి, దర్శకులు కృష్ణ కిశోర్ గారికి మరియు థియేట్రిక‌ల్ ట్రైలర్ లాంచ్ చేసిన సురేష్ బాబు గారికి దన్యవాదాలు తెలిపారు. ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్.M, DOP : రామ్ P రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, stunts: జాషువ.