Latest News

`జూన్ 1: 43` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి, జూన్‌లోనే రిలీజ్‌! డీజే అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది : పూజ హెగ్డే తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న 'ఆనందో బ్రహ్మ' ఇన్నోవేటివ్ మోషన్ పోస్టర్ అన్ని ఏరియాల స్పంద‌న అద్భుతం- `ఓ పిల్లా నీ వ‌ల్లా` ద‌ర్శ‌క‌నిర్మాత కిషోర్‌ సునీల్ 'ఉంగరాల రాంబాబు' జూన్ లో విడుదల `అంధ‌గాడు` సెన్సార్ పూర్తి.. జూన్ 2న విడుద‌ల గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' జూన్ 9 న విడుదల 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రాజ‌శేఖ‌ర్‌ 'గరుడ వేగ 126.18 ఎమ్' జూన్ 2న వ‌స్తున్న `వెక్కిరింత‌`విడుదల ఒకేసారి రెండు మల్టీ స్టారర్ సినిమాలు కలిసి చేస్తున్న సుధీర్ బాబు & నారా రోహిత్

సూర్య రేంజ్ మామూలుగా లేదుగా..


వ‌రుస‌గా పోలీస్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్ర‌వ‌రి 9 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలోయ‌ముడు, సింగం చిత్రాలను మించి ప్రీరిలీజ్ కే 100 కొట్ల బిజినెస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రం స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌ల‌ై సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంసలు పొందుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌తో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడ‌వ చిత్రం "S3-య‌ముడు-3". య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం "S3-య‌ముడు-3 ఇప్ప‌టికే 100 కోట్ల బిజినెస్ చేసి రికార్డు సాదించింది. ఓకే క‌థ‌,క‌థ‌నం, ఓకే ద‌ర్శ‌కుడు, ఓకే హీరో, ఓకే హీరో తో ఇలా మూడు పార్టులు రావ‌టం ఇదే మెట్ట‌మెద‌టిసారి. అయితే అన్ని చిత్రాలు సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌టం ఇదే మెట్ట‌మెద‌టి సారి.. అలాగే ఈ చిత్రంలో చాలా మాస్ ఆడియ‌న్స్ కి న‌చ్చే ఎలిమెంట్స్ వున్నాయి. డైర‌క్ట‌ర్ హ‌రి గారు ఈ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే తో థ్రిల్ ని క‌లిగించే స‌న్నివేశాల‌తో చిత్రం కొన‌సాగుతుంది. తెలుగు ప్రేక్ష‌కుల్లో హ‌రి స్క్రీన్‌ప్లే కి కూడా ఫ్యాన్స్ వుండ‌టం విశేషం, ఇప్ప‌టికే విడుద‌ల‌ైన టీజ‌ర్స్ చూసిన తర్వాత ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. వారి అంచ‌నాలను అందుకునేలా మా చిత్రం వుండ‌బోతుంది. సూర్య గారు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ గా యాక్ష‌న్ తో మ‌రొక్క‌సారి విజృంభించారు. అనుష్క న‌ట‌న‌కి ఈసారి శ్రుతిహ‌స‌న్ గ్లామ‌ర్ అడిష‌న‌ల్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్ష‌న్ లో మా సంస్థ పార్ట్ అయినందుకు చాలా అనందంగా వుంది. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియో కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రి 9న మా బ్యాన‌ర్ ద్వారా తెలుగు వెర్ష‌న్ ని విడుద‌ల‌ చేస్తున్నాము. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అని అన్నారు.