`శివ‌లింగ` ట్రైల‌ర్‌కు 10 ల‌క్ష‌ల వ్యూస్‌


కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ న‌టించిన తాజా చిత్రం ‘శివ‌లింగ’ త్వ‌ర‌లో రిలీజ్కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. `చంద్ర‌ముఖి` వంటి సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన `శివ‌లింగ ` చిత్రాన్ని అదే టైటిల్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కి అసాధార‌ణ‌మైన వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో 10 ల‌క్ష‌ల వ్యూస్ సాధించింది ట్రైల‌ర్‌.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ``కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రమిది. పి.వాసు గారి చంద్రముఖి ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. అలాగే లారెన్స్ కాంచన , గంగ ఏ స్థాయిలో విజ‌యాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైల‌ర్‌ , పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్ప‌టికే యూట్యూబ్‌లో 10 ల‌క్ష‌ల మంది ట్రైల‌ర్‌ని చూశారు. ఈనెల‌లోనే సినిమాని రిలీజ్ చేయ‌నున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రం`` అని తెలిపారు.

రితికా సింగ్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కెమెరా: స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై , దర్శకత్వంః పి.వాసు⁠⁠⁠⁠