Latest News

వీ.ఐ.పీ2 కోసం నాకు అబద్దం చెప్పారు: కాజోల్ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` పైర‌సీపై సైబ‌ర్ పోలీసుల‌కు పిర్యాదు చేసిన దిల్‌రాజు 28% Gst పై ధ్వ‌జ‌మెత్తిన టీ-ఫిలించాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌డు ఆర్.కె గౌడ్!! ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న `క‌దిలే బొమ్మ‌ల క‌థ‌` మహేష్ బాబు సినిమా షూటింగ్ లో ధోని హీరోయిన్ ఈనెల 30న అనుష్క ప్రధాన పాత్రగా వస్తున్న 'భాగమతి' ఫస్ట్ లుక్ విడుదల యాక్షన్ కింగ్ అర్జున్ ‘‘కురుక్షేత్రం’’ మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్ ఆగష్టులో విడుదల కానున్న రాజు గారి గది2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న సాయి ధరమ్ తేజ్ జవాన్ విడుద‌ల త‌మ్ముడు చ‌నిపోయినా, షూటింగ్ కు వెళ్లాడు..

శ‌ర్వానంద్ చేతుల‌మీదుగా `ఓ పిల్లా నీ వ‌ల్లా` టీజ‌ర్ లాంచ్‌


కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`.  కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా ప్ర‌ధాన‌తారాగ‌ణం. ఇటీవ‌లే టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `ఓ పిల్లా నీ వ‌ల్లా` పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించింద‌ని ప్ర‌శంసించారంతా. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ని `శ‌త‌మానం భ‌వ‌తి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో తారాప‌థంలోకి దూసుకొచ్చిన మెస్మ‌రైజింగ్ స్టార్ శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ``టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తెలుగు ప్రేక్ష‌కులు వైవిధ్యాన్ని, కొత్త‌ద‌నాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ద‌ర్శ‌కనిర్మాత కిషోర్‌కి అభినంద‌న‌లు`` అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిది. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో,మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాం. పూరి ఆవిష్క‌రించిన పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అలాగే  మెస్మ‌రైజింగ్ స్టార్‌ శ‌ర్వానంద్ లాంటి స‌క్సెస్‌ఫుల్ హీరో మా సినిమా టీజ‌ర్‌ని ఆవిష్క‌రించ‌డ‌మే ఓ పెద్ద స‌క్సెస్‌గా భావిస్తున్నాం. శ‌ర్వాకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు`` అన్నారు. 
 
కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చౌరాసియా  , సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.