వాళ్లు నాకు క‌నిపిస్తే... న‌య‌న‌తార వార్నింగ్


నయనతార అనగానే మీడియాకి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఆమె పై గాసిప్స్ క్రియేట్ చేయడానికి అంతా సిద్ధంగా ఉంటారు . ఎప్పటిలానే నయన్ పై మళ్ళీ మీడియాలో ఒక గాసిప్ వినిపిస్తుంది. అయితే అది నిజం కాదు. కావాలనే మీడియా జనాలు క్రియేట్ చేసిన స్పైసీ గాసిప్స్ .

మరి ఆ గాసిప్ ఏమిటో చూస్తే .. తమిళ స్టార్ హీరో శింబుతో నయనతార ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో తెలియదు గానీ.. వారి ప్రేమ పెళ్లిపీటలదాకా వెళ్లలేదు. మధ్యలోనే వారి ప్రేమకథ కంచికి చేరింది. అయితే.. తాజాగా వారిద్దరు ఒక్కటయ్యారు. పెళ్లిచేసుకున్నారు. గుళ్లో మూడు ముళ్ల బంధంతో దగ్గరయ్యారు. అయితే.. ఇదంతా నిజం కాదులెండి.. సినిమాలో. ఇలానే మీడియాలో కధనాలు వచ్చాయి . శింబుని గుడిలో పెళ్లి చేసుకున్న నయనతార అంటూ హెడ్డింగ్స్ కూడా పెట్టేసి ఆమె పరువు తీసేశారు . నాలుగు రూపాయల చిల్లర డబ్బు కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఈడ్చేశారు . దీనితో నయన ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసే వారి పై మంది పడింది ! ఇలాంటి న్యూస్ రాసే వారు ఎవరో నాకు తెలిస్తే వారిని చెప్పుతో కొడతాను అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది . సరసుడు సినిమాలో తాను శింబు తో కలసి యాక్ట్ చేస్తున్నాను అని , సినిమా కోసం చేసిన పనిని నిజ జీవితానికి ఆపాదించి వార్తలు రాయడం మరీ దిగజారుడు తనానికి నిదర్శనం అని నయన్ తన బాధని తెలియచేసింది. మరి ఇప్పటికైనా నయనతార పై గాసిప్స్ క్రియేట్ చేసే జనాలకి బుద్ది వస్తుంది ఏమో చూడాలి .