రాజా... మీరు కేక


గుంటూరు టాకీస్”.... చిన్న చిత్రాలు రిలీజ్ అవ్వడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో... ఈ చిత్రం ఇటివలే విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో రెండో ప్రయత్నంగా  డి. సురేష్ బాబు సమర్పణ లో R. K. Studios  అధినేత రాజ్ కుమార్. ఎం గారి నిర్మాణం లో నూతన దర్శకుడు కృష్ణ కిషోర్ దర్శకత్వంలో Production No: 2 “రాజా... మీరు కేక...!” అనే వర్కింగ్ టైటిల్ తో సంస్థ కార్యాలయంలో ఈరోజు (శుక్రవారం) లాంచనంగా పూజ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు గారు, దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు గారితో పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం రేవంత్, నోయల్ మరియు దర్శక నిర్మాతలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన హీరోయిన్ నటించబోతుందని, మే రెండో వారంనుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. చిత్ర నిర్మాత రాజ్ కుమార్ గారు గుంటూరు టాకీస్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ నూతన చిత్రాన్ని కూడా విజయవంతం చెయ్యాలని కోరారు. దర్శకులు కృష్ణ కిషోర్ మాట్లాడుతూ ముందుగా తనకి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత ఎం. రాజ్ కుమార్ గారికి, చిత్రం జరగడానికి మూలకారకులైన సురేష్ ప్రొడక్షన్ అధినేత డి. సురేష్ బాబు గారికి, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని విజయవంతంగా ప్రేక్షకుల  ముందుకి తీసుకు రావడానికి  కృషి చేస్తాను అని చెప్పారు. తాను గతంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో దృశ్యం సినిమాకి కో-డైరెక్టర్ గా పని చేసినట్టు తెలిపారు. మిగతా సాంకేతిక నిపుణులు కెమెరామెన్: రాం రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్: శ్రీ చరణ్, ఆర్ట్ డైరెక్టర్: మారేష్ బల్లంకి, ఫైట్స్: సోలమన్, మేకప్: అర్జున్, కాస్ట్యూమ్స్: లోకేష్, ప్రొడక్షన్ ఎక్సిక్యూటివ్: శోభన్, ప్రొడక్షన్ మేనేజర్: కార్తికేయ (శివ), స్టిల్స్: సందీప్, పబ్లిసిటీ డిజైన్: ఓంకార్ కడియం, పి.ఆర్.ఓ: శ్రీనివాస్ (GS Media)