Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

రియ‌ల్ క‌లెక్ష‌న్స్ బ‌య‌ట‌ప‌డ్డాయ్..


చిరంజీవి చాలా కాలం త‌ర్వాత‌ నటించిన ఖైదీ నెంబర్ 150వ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించిందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఖైదీ నెం.150 మూవీ వ‌సూళ్ల గురించి ఒక్కొక‌రు రోజుకో ఫిగ‌ర్ చెప్తున్నందున స్వ‌యంగా రామ్ చ‌ర‌ణ్ ఖైదీ వ‌సూళ్ల‌ను చెప్ప‌డానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిరంజీవి అభిమానులతో పంచుకునే మంచి శుభవార్త ఉంద‌న్నారు. తెలుగు సినీ చ‌రిత్ర‌లో వేగంగా వంద కోట్ల వ‌సూళ్లు సాధించిన సినిమాగా ఖైదీ నెం.150 నిలిచింద‌ని, మొత్తం వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 76,15,04,000 రూపాయ‌లు ఖైదీ సొంతం చేసుకుంద‌ని ఆయ‌న వివ‌రించారు. క‌ర్ణాట‌క‌లో 9కోట్లు, నార్త్ ఇండియాలో 1కోటి, 43ల‌క్ష‌లు,, వెస్ట్ అమెరికాలో 3ల‌క్ష‌లు, నార్త్ అమెరికాలో 10 ల‌క్ష‌లు వ‌సూలు చేసింద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మొదటి వారం రోజుల్లో 108 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసి, హ‌య్యెస్ట్ గ్రాస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఖైదీ నెం.150 రికార్డును సృష్టించింద‌న్నారు. సినిమాకు ఇంత‌టి ఘ‌న విజాయాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు చెప్తూ, త్వ‌ర‌లోనే అభిమానులంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెప్తూ, నిర్మాత రామ్ చ‌ర‌ణ్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయ‌నున్నాడ‌ని, ఆ ఈవెంట్ కు సంబంధించిన తేదీ , మిగ‌తా వివ‌రాలు కూడా త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌న్నారు.