రెండో సినిమాకే లిప్ లాక్ చేసేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?


తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు హీరోయిన్స్ కొరత ఉందా అంటే అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికే ఉన్న సీనియర్ హీరోయిన్స్ ఎవరూ ప్రేక్షకులను అంతగా ఆకట్టులోకపోతున్నారు అన్నది నిజం. కాజల్, తమన్నా, సమంతా లాంటి హీరోయిన్స్ ని చూసి, చూసి తెలుగు సినిమా ప్రేక్షకులు కొత్త హీరోయిన్స్ కోసం ఎదురు చూస్తున్న తరుణం ఇది. అందుకే ఇప్పుడు తెలుగు దర్శక, నిర్మాతల దృష్టి కొత్త హీరోయిన్లపై పడింది. అలా వెతికే పనిలోనే అను ఇమ్మాన్యుయేల్ అనే కొత్త అమ్మాయి తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది.

Anu Emmanuel Latest Photos-Stills

‘మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం పూర్తిగా యూత్ ని టార్గెట్ చేసి తీసిన కమర్షియల్ సినిమా. అందుకే ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ తన అంధ చందాలతో రెచ్చిపోయింది అని సమాచారం. అందుకే అయితే ఇప్పుడు ఈ చిత్రం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌‌గా మారింది. డైరెక్టర్ వంశీ కృష్ణ షూటింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా రాజ్ తరుణ్- అను ఇమ్మాన్యుయేల్‌ ల లిప్ లాక్ చిత్రీకరించి సినిమాలో జోడించారట. ఈ సీన్‌‌ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌‌గా మారుతుందని టాక్ . ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అవుతున్న వారే లిప్ లాక్ అనగానే నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంటే.. అను ఇమ్మాన్యుయేల్‌ తన రెండో చిత్రానికే ఇంత తెగించేయడం అందరికి షాక్ కలిగిస్తుందట . మరి ఈ మజ్ను ఇదే స్పీడ్ తో రెచ్చిపోతే సీనియర్ హీరోయిన్స్ కి పోటీ ఇంకొంచెం పెరిగినట్టే అని చెప్పుకోవచ్చు.