రకుల్ ప్రీత్ ఎదుర్కొన్న కష్టాల గురించి మీకు తెలుసా ?


ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే రకుల్ ప్రీత్ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు ఏ స్టార్ హీరో సినిమా చేస్తున్న అందులో హీరోయిన్ గా అందరి మొదటి అప్షన్ ఈ బ్యూటీ నే . అయితే తాను ఈ రేంజ్ కి చేరుకోవడానికి ముందు చాలా ఇబ్బందులు , చాలా అవమానాలు ఎదుర్కొన్నాను అని చెప్తుంది రకుల్ ! మొదట్లో సందీప్‌ కిషన్‌ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ వంటి హిట్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత రెండేళ్లు తనను ఎవ్వరు పట్టించుకోలేదట . ఆ సమయంలో తాను చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది రకుల్‌.

టాలీవుడ్‌లో నాకు ఎవ్వరూ గాడ్ ఫాదర్ లేడు , ఎవ్వరూ నాకు రెడ్ కార్పెట్‌ పరిచి అవకాశాలు ఇచ్చేయలేదు. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. చాలా సినిమాల్లో ముందు నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసుకొని ఆ తర్వాత నన్ను తీసేసి వేరే హీరోయిన్‌ను పెట్టుకునేవారు. ఒక్కోసారి అయితే నన్నెందుకు తీసేశారో కారణం కూడా చెప్పేవారు కాదు అంటూ పాత రోజులను గుర్తుకి తెచ్చుకుంది ఈ స్టార్ హీరోయిన్ . ఆ అవమానాల నుండే తాను చాలా నేర్చుకున్నానని, ఇప్పుడు తాను మానసికంగా కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నానని శెలవిచ్చింది ఈ బ్యూటీ.