మ‌ల్టీస్టార‌ర్ చేస్తా కానీ, ఎవ‌రితోనో చెప్ప‌ను - బాల‌కృష్ణ‌


బాల‌కృష్ణ ప్ర‌తిష్టాత్మ‌క చిత్ర‌మైన గౌతమిపుత్ర శాత‌క‌ర్ణి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవ‌ర్సీస్ లోనూ భారీ వ‌సూళ్లే రాబ‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌, మీడియాతో ముచ్చ‌టించారు. ఇంత‌టి విజ‌యాన్ని త‌న‌కు క‌ట్ట‌బెట్టినందుకు ఎంతో సంతోషంగాఉంద‌ని, ప్రేక్ష‌కులంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెప్పుకున్న బాల‌య్యకు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. మీరు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తారా, న‌టిస్తే ఎవరితో క‌లిసి చేస్తారు అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా, మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయడానికి త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని, తానెప్పుడైనా సిద్ధ‌మే కానీ, ఎవ‌రితో చేస్తానో చెప్ప‌ను కానీ, ఖ‌చ్చితంగా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో , అది కూడా పౌరాణికంలోనే చేస్తాన‌ని బాల‌య్య సెల‌విచ్చారు. గ‌తంలో గాంఢీవం, అశ్వ‌మేథం సినిమాల్లో బాల‌య్య న‌టించిన సంగ‌తి తెలిసిందే.సో, ఇప్పుడు బాల‌య్య వెండితెర‌ను, ఏ హీరోతో క‌లిసి పంచుకుంటాడో చూడాలి.