మార్చి తొలివారంలో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌`


శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ సంస్థ నుంచి వ‌రుస‌గా క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లోనే త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌  `ధురువంగ‌ల్ ప‌దినారు` (డి-16) తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. రెహ్మాన్ హీరోగా న‌టించిన  ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పారు.  ఇటీవ‌ల రిలీజైన ఫ‌స్ట్‌లుక్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ -``త‌మిళంలో ఇటీవ‌ల రిలీజై ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న `ధ‌రువంగ‌ల్ ప‌దినారు` చిత్రాన్ని తెలుగులో `16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దించాం. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్‌కి త‌మిళ‌నాట‌ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అక్క‌డ‌ ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. వాస్త‌వానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్ధేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాల‌నుకున్నా.. పోటీప‌డి మ‌రీ చేజిక్కించుకున్నాం. అందుకు త‌గ్గట్టే తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే చిత్ర‌మిది`` అన్నారు. కెమెరా:సుజిత్ స‌రంగ్, సంగీతం: జాకేష్ బిజోయ్.