మెగాస్టార్ కి మళ్ళీ ఆ కష్టాలు మొదలయ్యాయి ..


రాజకీయాల్లో ఎన్నో కష్టాలు అనుభ‌వించిన‌ తరువాత , మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ సినిమాతో మళ్ళీ తానే నెంబర్ వన్ అని నిరూపించుకున్నారు మెగాస్టార్ . తనకి తిరుగు లేని సినీ రంగంలో బిజీ గా ఉంటూ రాజకీయ తల నొప్పులను పక్కన పెట్టిన చిరుకి ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. తొందర్లోనే ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో యూపీలో పార్టీ తరఫున ప్రచారం చేయాలని చిరును రాహుల్ కోరినట్లుగా తెలుస్తోంది. యూపీలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండటం.. ఆయన సినిమా గ్లామర్ తోపాటు..పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఇమేజ్ పార్టీకి లాభంగా మారుతుందన్న మాటను చిరుకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
 
అయితే ఇప్పట్లో పొలిటికల్ గా ఎలాంటి మూమెంట్స్ లేకపోవడం తో చిరు తన నెక్ట్స్ రెండు సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు . ఈ నేపథ్యంలో పార్టీకి సాయం చేయాలన్న యువరాజు మాట చిరును డైలమాలో పడేసిందని చెబుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రాహుల్ కాల్ కు  చిరు తన స్పందన ఇంకా తెలపలేదు అని తెలుస్తుంది . నిజానికి చిరుకి కాస్త గ్యాప్ ఉన్నా ప్రచారానికి  వెళ్లాలా? వద్దా? అర్ధం కావడం లేదట. తన ప్రచారం కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుందన్న విషయంపై చిరుకు సందేహాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. సో ఈ లెక్కలు అన్నీ వేసుకొని చిరు ఎలక్షన్ క్యాంపింగ్ కి దూరంగా ఉండబోతున్నారు అని తెలుస్తుంది.