బేవ‌ర్స్ తండ్రిగా రాజేంద్ర‌ప్ర‌సాద్


ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే చివరి షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. మీ శ్రేయోభిలాషి వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన రమేష్ చెప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర  పోషిస్తున్నారు. 
 
గెలిచాక అందరూ నమ్ముతారు... ఫ్యామిలీ అంటే ప్రయత్నాన్ని నమ్మేవాళ్లు.. అనే కథాంశంతో యూత్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అన్ని కమర్షియల్ హంగులతో ముస్తాబవుతున్న ఈ చిత్రంలో తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తాయి. నెల రోజుల నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ముద్దపప్పు ఆవకాయ ఫేం అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ, షేకింగ్ షేషు, ఆర్జే హేమంత్, రాకేష్, ఫణి, వరంగల్ భాష తదితరులు నటిస్తున్నారు. 
 
సంగీతం - సునీల్ కశ్యప్
సాహిత్యం - సుద్దాల అశోక్ తేజ, భాస్కర భట్ల
ఎడిటర్ - ఎం.ఆర్.వర్మ
కెమెరా - కె.చిట్టిబాబు
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - రమేష్ చెప్పాల